Tuesday, March 24, 2026
Home » పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి…రాష్ట్రపతి దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి…రాష్ట్రపతి దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి...రాష్ట్రపతి దిగ్భ్రాంతి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:- మధ్య ప్రదేశ్ లోని రాజాఢ్ జిల్లా పిప్లోడీ ప్రాంతంలో ట్రాక్టర్ తిరగబడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ కు చెందిన వీరు ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిలో 13 మంది జిల్లా హాస్పటల్ లో చేర్చబడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు. తల, ఛాతికి గాయాలైన పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్‌కు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ హర్ష్‌ దీక్షిత్‌ తెలిపారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch