Thursday, March 19, 2026
Home » హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం – 31,602 ఓట్లతో గెలుపు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం – 31,602 ఓట్లతో గెలుపు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం - 31,602 ఓట్లతో గెలుపు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 31,602ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపికపై విజయం సాధించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బాలకృష్ణ హాట్రిక్ విజయాన్ని సాధించారు. 2014లో బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి 81,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాలకృష్ణ విజయంతో ఆయన నివాసం వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch