Friday, February 27, 2026
Home » వైసీపీ ఓటమిని తట్టుకోలేక అభిమానుల మృతి… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వైసీపీ ఓటమిని తట్టుకోలేక అభిమానుల మృతి… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వైసీపీ ఓటమిని తట్టుకోలేక అభిమానుల మృతి... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా (డి) గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్ (28) జగన్ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి చెందడం తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. వైఎస్ఆర్(డీ) దిగువ తంబళ్లపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త చిన్నయల్లాలు(63) గుండెపోటుతో చనిపోయాడు. కర్నూలు(డి) చిన్నతంబళంలోనూ ఊరుకుందప్ప (68) టీవీ చూస్తూ వైసీపీ ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచారు.

ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. 164కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ బొక్కబోర్ల పడింది. ఊహించని పరాజయంతో ఫలితాల పట్టికలో వైసీపీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. కేవలం 11 సీట్లతో వైసీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch