
ముద్ర,తెలంగాణ:-మొగిలయ్యకు కిడ్నీ, గుండె సంబంధింత వ్యాధులున్నాయి. దాంతో కొన్నిళ్ల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ అవకాశం మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించడం కోసం వరంగల్‌లోని సంరక్ష అనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో మొగిలయ్య భార్య మాట్లాడుతూ.. చికిత్సకు డబ్బులు లేవని.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమైంది.
ఇక మొగిలయ్యకు సూచించే సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చు రావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. కిడ్నీ సమస్యలతో పాటు గుండె, కంటి చూపు మందగించడం వంటి అనారోగ్య సమస్యలు కూడా మొగిలయ్యాను వెంటాడుతున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మెగాస్టార్ చిరంజీవి మొగిలయ్య చికిత్సలు చేశారు.ఇప్పుడు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తమను ఆదుకోవాలంటూ మొగిలయ్య భార్య రేవంత్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొగిలయ్య స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామం.
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బలగం మొగిలయ్య
చికిత్సకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య ఆవేదన pic.twitter.com/gftQzXt9LA
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 5, 2024