
మోత్కూర్, ముద్ర: మోత్కూర్ వ్యవసాయ శాఖ పరిధిలో యాదాద్రి భువనగిరి ఇంటర్నల్ డిస్టిక్ స్క్వాడ్ టీం పద్మావతి, వ్యవసాయ సంచాలకులు యాదగిరిగుట్ట, తుర్కపల్లి ,బొమ్మలరామారం మండల వ్యవసాయ అధికారులు దుర్గేశ్వరి, పద్మ, సహాయపోలీసుల మండల వ్యవసాయ అధికారులు, విత్తనాలు స్థానిక మండల వ్యవసాయ అధికారి స్వప్నతో కలిసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా శ్రీ రామలింగేశ్వర, గ్రోమోర్ సెంటర్ శ్రీరామను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా విత్తనరసీదులను ఇన్వాయిస్లను ,స్టాక్ రిజిస్టర్లను , డెలివరీ చలానా పొందిన సోర్స్ సర్టిఫికెట్లను ,స్టాక్ బోర్డ్ పైన విత్తన రకాల,ఎమ్మార్పీలను పరిశీలించడం జరిగింది. ఇంకా డీలర్లు తప్పనిసరిగా రైతులకు రసీదు అందజేసి సంతకం తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.
ఈ రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచవలసిందిగా రైతులకు సూచించడం జరిగింది. ఇతర రోజువారి రైతుల రిజిస్టర్‌లను పరిశీలించడం జరిగింది మరియు కంపెనీ నుండి విత్తనములను పొందిన వెంటనే ఇన్‌వాయిస్‌లో లాట్ నంబర్లు , ప్యాకెట్ల పై లాట్ నంబర్లను సరిచూసుకోవాల్సిందిగా మరియు విత్తన బ్యాగుల మీద లేబుల్‌లను సరిచూసుకుని రైతులకు విక్రయించాల్సి ఉంది. నాణ్యమైన విత్తనములను మాత్రమే రైతులకు అమ్మవలసిందిగా,ఎమ్మార్పీలకు మాత్రమే విక్రయించాల్సింది గాచో చట్టారీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని. ఈ కార్యక్రమంలో దుకాణం యాజమానులు ఉన్నారు.