Friday, February 27, 2026
Home » ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని రామలింగంపల్లి తండాకు చెందిన రమావత్ రాజు నాయక్ కిడ్నీ సమస్యతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా భాదిత కుటుంబానికి రెండు లక్షల 50 వేల రూపాయలు ఎల్ సి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బంటు గణేష్, గుగులోతు మహిపాల్ నాయక్,రాంబాబు,రమేష్, వెంకటేష్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch