Friday, April 17, 2026
Home » మాజీ మంత్రి డీ ఎస్ మరణం తీరని లోటు… బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మాజీ మంత్రి డీ ఎస్ మరణం తీరని లోటు… బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 మాజీ మంత్రి డీ ఎస్ మరణం తీరని లోటు... బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్: సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో డి శ్రీనివాస్ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పీసీసీ అధ్యక్షులు, మంత్రిగా తెలుగు ప్రజలకు డీఎస్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన డీ శ్రీనివాస్ అంచెలంచెలుగా జాతీయస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch