Tuesday, March 17, 2026
Home » ఘనంగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఘనంగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఘనంగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్రణ న్యూస్ బ్యూరో,హైదరాబాద్: మౌలాలిలోని శ్రీరంగగిరిపై రంగనాథస్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.

ఉదయం ప్రభాత ఆరాధన అనంతరం తిరుప్పావై, ప్రాబోదకి ఆరగింపు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర బి.జె.పి అధికార ప్రతినిధి ఎన్.వి.ఎస్.ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్లు జె.ప్రభుదాస్, పి.దేవ రెడ్డి, మాజీ కార్పొరేటర్.శ్రీనివాసరెడ్డి, ఇతర స్థానిక నాయకుల సేవా కైంకర్యంలో కొనసాగుతున్నారు. .ప్రాబోదకి అనంతరం ద్వార తోరణ ధ్వజకుంభారాధన, చతుస్థ్సానార్చన అనంతరం అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్రహవనం జరిగాయి.

10-30కు వైనతేయ ప్రతిష్ఠ, ధ్వజపట ఆరాధన, ధ్వజారోహణం, గరుడబలి, ప్రసాద నివేదన అనంతరం ఆ ప్రసాదాన్ని సంతానార్థులైన జంటలకు వితరణ చేశారు. జరిగింది. కన్నులపండువగా జరిగిన ధ్వజారోహణం అనంతరం నిత్యపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరిగింది.
శ్రీరంగగిరి వైభవం భాగ్యనగరమంతా వ్యాపించి, నగరానికే ఈ కొండ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కొనియాడారు. దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch