లోక్ సభ స్పీకర్ గా రెండోసారి బిజెపి ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నిక అయినట్టు ప్రోటెం స్పీకర్ ప్రకటించారు. బుధవారం లోక్ సభ సమావేశమైన వెంటనే మిగిలిన సభ్యులతో ప్రమాణం చేయించారు ప్రోటెం స్పీకర్. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఆమోదం తెలపడం, తిరస్కరించడం చేశారు. స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నిక జరిగింది. సభాపతి పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదర ఎంపిక ఎన్నిక అనివార్యమైంది. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్తోపాటు పలువు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. ఇండియా అభ్యర్థిగా కె సురేష్ పేరును కూటమి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేశారు.
దీన్ని పక్కన విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటింగ్ కార్యక్రమం. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంట రాగా ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆశీనులయ్యారు. ఆయనకు మోడీ, రాహుల్ సహా లోక్ సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేసి ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోట నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86% హాజరు నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలు అడిగారు. 2019లో గెలిచాక తొలిసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. మళ్లీ తాజాగా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.