Sunday, March 15, 2026
Home » తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ” ఆరోగ్య శ్రీ “లో మరిన్ని సేవలు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ” ఆరోగ్య శ్రీ “లో మరిన్ని సేవలు…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్!



ముద్ర,తెలంగాణ:-తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక నుంచి ఆరోగ్య శ్రీ ద్వారా చేయించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

ప్రస్తుత ఆరోగ్య శ్రీలో ఉన్న 1672 చికిత్స విధానాల్లో 1375 ప్రోసీజర్లకు ప్యాకేజీ ధరలు పెంచారు. దీనికి అదనంగా వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా, ఈ నిధులను విడుదల చేసినట్లు భట్టి విక్రమార్క మరో ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉండగా, వీరికి ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. తెలంగాణ ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch