Wednesday, March 25, 2026
Home » కాంగ్రెస్ లోకి కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కాంగ్రెస్ లోకి కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 కాంగ్రెస్ లోకి కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ ?  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్రణ ప్రతినిధి, కరీంనగర్ :కరీం జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త కరీంనగర్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం హుస్నాబాద్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న రాజకీయ సమీకరణలపై చర్చలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జడ్పీ చైర్‌పర్సన్ మంత్రిని కలవడం తీవ్ర చర్చకు దారితీసింది. కనుమల్ల విజయతోపాటు పలువురు జడ్పీటీసీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో రానున్న ఐదు సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందని కీలక నేతలు అంతర్మధనంలో పడుతున్నారు. జడ్పీ చైర్ రాజకీయాల్లో పర్సన్ పార్టీ మారితే జిల్లా సంచలనమే అవుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch