Thursday, February 19, 2026
Home » ఏడాదిలో ఏడుగురు, ఏసీబీ దాడులంటే ఉద్యోగులకు మామూలే!-నిర్మల్ జిల్లా ఏసీబీ ఏడాదిలో ఏడు దాడులు లంచాల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు భయం లేదు ,తెలంగాణ న్యూస్ – Sravya News

ఏడాదిలో ఏడుగురు, ఏసీబీ దాడులంటే ఉద్యోగులకు మామూలే!-నిర్మల్ జిల్లా ఏసీబీ ఏడాదిలో ఏడు దాడులు లంచాల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు భయం లేదు ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
ఏడాదిలో ఏడుగురు, ఏసీబీ దాడులంటే ఉద్యోగులకు మామూలే!-నిర్మల్ జిల్లా ఏసీబీ ఏడాదిలో ఏడు దాడులు లంచాల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు భయం లేదు ,తెలంగాణ న్యూస్


వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఒంట్లో భయం లేకుండా పోతుండడం చర్చకు దారి తీస్తుంది. ఏసీబీ అంటే అసలు భయమే లేకుండా పోతుంది. అవినీతి నిరోధక శాఖ అంటే గతంలో హడలిపోయేవారు. ఏసీబీ దాడులు అంటూ ఎప్పుడో ఒకసారి వినిపించేది. కానీ లంచం తీసుకోవడం.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం సాధారణంగా మారిపోయింది. లంచం తీసుకుంటూ పట్టుబడితే కొంతకాలానికి ఉద్యోగం రాకుండా పోతుందా? మళ్లీ ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉద్యోగుల అధికారులను లంచావతారులుగా మారుస్తుంది. నిర్మల్ సరిగ్గా ఏడాది తిరగక ముందే ఏడుగురు ఉద్యోగుల అవినీతి నిరోధక శాఖకు చిక్కడం పెరుగుతున్న లంచాల ఉద్దీపనకు అద్దం పడుతుంది. సత్వరమే పనులు చేయించుకునేవారు దొడ్డి దారిన లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అలాంటి కేసులు అసలు బయటకు రావడం లేదు. ప్రధానంగా నకిలీ, పురపాలక శాఖలో అవినీతి భారీగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిస్థితులను బట్టి చూస్తే అధికారులు ఉద్యోగులకు ఏ స్థాయిలో లంచాలకు మరిగారో అర్థం అవుతున్నది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch