Thursday, February 26, 2026
Home » ప్రియాంక గాంధీ విజయంతో కాంగ్రెస్ కు పునర్ వైభవం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రియాంక గాంధీ విజయంతో కాంగ్రెస్ కు పునర్ వైభవం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
ప్రియాంక గాంధీ విజయంతో కాంగ్రెస్ కు పునర్ వైభవం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • జార్ఖండ్‌లో రెండోసారి ఇండియా కూటమి విజయం హర్షణీయం
  • వచ్చే ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమైంది
  • వెలిచాల రాజేందర్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం రాబోతున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ భారీ విజయం వైపు దూసుకెళ్తున్న ఆమెకు రాజేందర్ రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో రెండోసారి ఇండియా కూటమి అధికారంలోకి రావడం హర్షనీయమని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసి ఇండియా కూటమిని గెలిపించారని తెలిపారు. ఇండియా కుటుంబంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మి ఓట్లు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కరిష్మా వల్లే జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించిందని చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, మహారాష్ట్రలో లాడ్లీ బెహనాతో పాటూ అన్నీ స్కీం లు తూచ్ అనకుండా తూచా తప్పకుండా అమలు చేయవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఓటమికి గల కారణాలపై సమీక్షించుకుంటామని పేర్కొ న్నారు. గ్రౌండ్ లెవెల్ లో మరింత కష్టపడి పనిచేసి మళ్లీ మహారాష్ట్రలో ప్రజల ఆమోదం పొందుతామని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఓడిపోవడం ఖాయమని, తిరిగి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో పార్టీ అధిష్టానం, అందుకు గల కారణాలను సమీక్షించి పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తుందని చెప్పారు. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసేలా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని, నాయకులు, కార్యకర్తలను సంఘాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ వాయనాడు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు 3 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇది దేశ రాజకీయాలనే కీలక మలుపు తిప్పబోతుందని, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జోష్ నింపబోతున్నదని ఆనంద వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని, రోజురోజుకు ఆదానీ అవినీతి వ్యవహారం, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తుండడం వల్ల ప్రధాని మోదీ ప్రజల్లో పలుచన అవుతున్నారని. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. అవగాహన గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని, అందుకే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతామని రాజేందర్ రావు చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch