51
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రజాపాలన అందిస్తుందని మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్ అన్నారు. బుధవారం పానగల్ మండలంలోని మల్లాయపల్లి గ్రామంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు దీటుగా ప్రజలే సమాధానం చెప్పే విధంగా చైతన్యం చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మాదరావుపల్లి, దావత్ ఖాన్ పల్లి గ్రామాలకు సాగునీరు అందించే మేజర్ 4 కాలువను పరిశీలించారు.