పోలీస్ డ్యూటీకి సంబంధం లేని పనులు
పోలీస్ డ్యూటీకి సంబంధం లేని పనులు కానిస్టేబుళ్లతో చేయిస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు స్పెషల్ పోలీసులు. బెటాలియన్లో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులతో పాటు వాగులో ఇసుక, పంటపొలాల్లో వరిగడ్డి కట్టలు తెచ్చే పనులు చేయించారన్నారు. చివరకు మిషన్ భగీరథ పైపులు దొంగతనంగా తేవాలని కమాండెంట్ హుకుం జారీ చేయడంతో పైపులు సైతం తెచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర అధికారుల పెత్తనం ధ్వజమెత్తారు. అధికారుల ఇళ్లలో పాచి పనులు, బొల్లు తోమడం, ఇళ్లు ఊడవడం, పిల్లలను స్కూల్ కి పంపడం, మందు తాగి పబ్బులో పడిపోతే తీసుకురావడం లాంటి వెట్టి చాకిరీ పనులు చేయిస్తున్నారని కానిస్టేబుల్ ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులు భార్యలు ఆందోళన దిగితే వారిని అదుపులోకి తీసుకుని బెటాలియన్ కు తీసుకువచ్చి డ్యూటీ పేరుతో తమ భర్తలు ఇంటికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తే స్పెషల్ పోలీసులు ఎందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని అధికారులను నిలదీశారు.