1
కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతున్నామనే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి వైఫల్యాలు ఎండగడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల మోసం, మూసీ ప్రక్షాళన స్కామ్, బావమరిదికి అమృత టెండర్లు, ఇలా కాంగ్రెస్ స్కామ్ లను బయటపెడుతున్నామన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ను ఇబ్బంది పెట్టాలంటే రేవంత్ పార్టీ అంటూ దుష్ర్పచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 11 నెలలుగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో నడుస్తుంది. రాజకీయంగా బీఆర్ఎస్ తో పోటీపడలేక, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఆరు గ్యారంటీల అమలు, ఇతర విషయాలపై మంత్రులు సహా కాంగ్రెస్ నేతలు ఎవరైనా ముందుకొచ్చి సమాధానం చెప్పే పరిస్థితి. అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబసభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారు.