Monday, May 25, 2026
Home » అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్: జీఎం అరుణ్ కుమార్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్: జీఎం అరుణ్ కుమార్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్: జీఎం అరుణ్ కుమార్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే పూర్తి అయిందని జీఎం పేర్కొన్నారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం, నిధులు మంజూరు కాగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో శుక్రవారం విజయవాడ సత్యనారాయణపురం వద్ద ఉన్న ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్‌లో సమావేశం జరిగింది.

రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని ఈ సందర్భంగా జీఎం తెలిపారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. రూ.21వేల కోట్ల రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలు చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. పలు అభివృద్ధి జరుగుతున్న చర్యలను ఆయన వివరించారు. బడ్జెట్ లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,151 కోట్లు కేటాయించడం జరిగింది.

ఏపీలో రూ.21వేల కోట్ల పనులు జరుగుతున్నాయని, అందులో 1,687 కొత్త, డబుల్, ట్రిపుల్ లైన్ పనులు ఉన్నాయని చెప్పారు. ఏపీలో 97 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణ జరిగినట్లు వివరించారు. గత మూడేళ్లలో తొమ్మిది ఆర్వోబీలు, 79 ఆర్యూబీలు నిర్మించామని, వివిధ స్టేషన్లలో 35 పుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో 12 బ్రిడ్జీలు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నామని చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch