Wednesday, March 11, 2026
Home » ప్రభుత్వం ఉద్యోగం సాధించిన యువకుడికి ఘనంగా సన్మానం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రభుత్వం ఉద్యోగం సాధించిన యువకుడికి ఘనంగా సన్మానం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ప్రభుత్వం ఉద్యోగం సాధించిన యువకుడికి ఘనంగా సన్మానం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర.వీపనగండ్ల:- పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిట్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించిన వీపనగండ్ల విద్యార్థి బత్తుల విజయ్ కుమార్ యాదవ్ ను యాదవ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. బత్తుల యాదయ్య సరోజ కుమారుడు విజయ్ కుమార్ యాదవ్ ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఏఈ నోటిఫికేషన్ ఫలితాలలో ఉద్యోగం సంపాదించిన సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో యువకుడిని అభినందించారు.

ఈ సందర్భంగా యాదవ సంఘం యూత్ అధ్యక్షుడు మదుగని శివ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎత్తం కృష్ణయ్య లు మాట్లాడుతూ విజయ్ కుమార్ యాదవ్ ఇంకా భవిషత్ లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని అలాగే ఉద్యోగ వృత్తిలో మచ్చలేని ఉత్తమ ఆఫీసర్ గా ఎదగాలని,యువత నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ఎదగాలని బత్తుల విజయ్ కుమార్ యాదవ్ అన్నారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ర్యాంకర్స్ హై స్కూల్ వనపర్తి, సివిల్ డిగ్రీ డిప్లమా కేడీఆర్ పాలిటెక్నికల్ కళాశాల వనపర్తి, బీటెక్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో పూర్తి చేసింది.

సివిల్ పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ)గా గజిటెడ్ ఉద్యోగం సాధించడం పట్ల విజయ్ కుమార్ ను తల్లిదండ్రులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.గ్రామంలో విజయ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో నాయకులు బాలస్వామి, శివయాదవ్, అపోలో నారాయణ వెంకటయ్య, రాజు, మహేష్, వెంకటేష్ యాదవ్,రమేష్ యాదవ్,కానమోని శ్రీను యాదవ్ అయ్యారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch