Thursday, April 16, 2026
Home » 5 స్టార్ రేటింగ్ పొందిన లులూ హైపర్ మార్కెట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

5 స్టార్ రేటింగ్ పొందిన లులూ హైపర్ మార్కెట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 5 స్టార్ రేటింగ్ పొందిన లులూ హైపర్ మార్కెట్ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



హైదరాబాద్ 30 జూలై 2024: ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వారు లులూ హైపర్ మార్కెట్ 5 స్టార్ హైజినీ రేటింగ్ పొందారు. ఆహార పదార్థాలు భద్రతా మరియు శుభ్రతల పట్ల అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు లులూ హైపర్ మార్కెట్‌కు ఈ ఉత్తమ రేటింగ్ లభించింది. ఇది లులూ హైపర్ మార్కెట్ ఆహార పరిశుభ్రతకు నిదర్శనం.

లులూ హైపర్ మార్కెట్ ఖాతాదారులు అందరి కొరకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహార నిర్వహణ, తయారుచేయుట మరియు ఆహారం నిల్వచేయుటలో అంకితభావంతో పాటిస్తున్న సామర్ధ్యతకు FSSAI వారి 5 స్టార్ రేటింగ్ అత్యున్నత ప్రశంసలు. ఆహార భద్రతకు సంబంధించి వివిధ దశలలో పాటిస్తున్న అంటే పరిశుభ్రతల, పురుగుల నియంత్రణ (పెస్ట్ కంట్రోల్), సిబ్బందికి శిక్షణ మొదలైన రంగాలతో కలుపుకుని చేపడుతున్న ప్రక్రియల విలువలు చాటిచెబుతాయి.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 5 స్టార్ గుర్తింపును లులూ హైపర్ మార్కెట్ పొందిన సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ శ్రీ MVవిమేష్ మాట్లాడుతూ ఈ రేటింగ్ మాకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. మా దుకాణం ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచడానికి మరియు ఖాతాదారులకు సురక్షితమైన మరియు అధిక నాణ్యత కలిగిన ఆహార ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా సంస్థ ఫ్రెష్ – ఫుడ్ మేనేజర్ శ్రీ లెనిన్ మాట్లాడుతూ అత్యున్నతమైన షాపింగ్ అనుభూతిని ఖాతాదారులకు అందించడంలో పాటిస్తున్న సమగ్రమైన ఆహార భద్రత ప్రధానమని మేము విశ్వసిస్తాము. మేము FSSAI వారి 5 స్టార్ రేటింగ్ మా పనిలోని విశిష్టతను మరియు మా అంకితభావమైన పనితనాన్ని మరింత పటిష్టం చేస్తాము.

లులూపర్ మార్కెట్ సమగ్రమైన ఆహార భద్రతా యాజమాన్య వ్యవస్థను అమలుపరచటమే కాక క్రమం తప్పకుండా సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం, పరిశుభ్రత ముందస్తు విధానాలు అమలు చేయడం మరియు ఆహార భద్రతా సంరక్షణ నిరంతర పర్యవేక్షణ.

లులూ మాల్ హైదరాబాద్ గురించి…

లులూ మాల్ హైదరాబాద్ ఒక ఉత్తమ షాపింగ్ గమ్యస్థానం. ఇందులో విస్తృత శ్రేణి షాపింగ్ అవుట్ లెట్స్, డైనింగ్ ఆప్షన్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ ఈ మాల్ జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తులను అందించడమే కాక మల్టీప్లెక్స్ సినిమా, కుటుంబ వినోద కేంద్రంగా విరజిల్లుతోంది. ఇక్కడ తరచు ఈవెంట్స్ మరియు ప్రచార (ప్రమోషన్) కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, కిరాణా సరకులు మరియు జీవన విధానానికి అవసరమైనవి అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు అద్బుతమైన షాపింగ్ అనుభూతిని మరియు వినోదాన్ని అందించే గమ్యస్థానం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch