15
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. వేధింపులు తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.