సింగరేణి ఉద్యోగాలు
సింగరేణి యాజమాన్యం మార్చి నెలలో విడుదల చేసిన ఎక్స్‌టర్నల్ సెకండ్ నోటిఫికేషన్‌లో భాగంగా ఏడు విభాగాల్లో 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఈ ఉద్యోగ రాత పరీక్షలను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 6, 7 తేదీల్లో జరుగుతుందని. 7 రకాల కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను వడ్డాట్లు గుర్తించారు. https://scclmines.com/ వెబ్‌సైట్‌లోకి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ తో పాటు పరీక్షల షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చని వివరించింది. షెడ్యూల్ ప్రకారం రోజు మొదటి అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (ఎలక్‌కల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్–సీ, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ కేటగిరీ– 1, ఫిట్టర్ కేటగిరి –1 పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక రెండో రోజు అంటే 7వ తేదీన మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఈ-2) మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సిస్టమ్) ఈ–2, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (మెకానికల్) టీఅండ్‌ఎస్– సీ పరీక్షలు జరుగుతున్నాయి.