Thursday, November 21, 2024
Home » ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారు.. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్

ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారు.. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్

0 comment

ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారనీ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైరయ్యారు. ఇంట్లో ఒక బిడ్డకే తల్లికి వందనం పథకమని ఫేక్ జీవో తయారు చేసి పెయిడ్ బ్యాచ్ తో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం సాగించారు. బిడ్డలు ఎంతమంది ఉన్నా పథకం వర్తిస్తుందని మా యువ నాయకుడు నారా లోకేష్ ఇచ్చిన క్లారిటీతో మీ ఫేక్ ప్రచారాలను జనం ఛీ కొడుతున్నారనీ మండిపడ్డారు. జులై 1వ తేదీన పెన్షన్లు ఇవ్వలేమని ఫేక్ ప్రచారం చేశారు కానీ వాలంటీర్ పాత్ర లేకుండా సచివాలయం సిబ్బందితో ఒకేరోజు పెన్షన్లు అందించామని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మంచి కోసం కనీసం పట్టించుకోని మీరు.. అధికారానికి దూరమైతే మాత్రం అల్లాడిపోతూ, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో నిన్న మీరు చేసిన హడావిడి కూడా ప్రజలు చూస్తున్నారనీ.. ప్రజా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారాన్ని మానకపోతే ప్రజలు మీకు ఆల్ ఫేక్ జగన్ బిరుదు ఇవ్వడం ఖాయం అని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch