వికారాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై భౌతిక దాడులకు పాల్పడటం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ జందార్ శ్రీను, హోంగార్డ్ కేశవ్‌తో కలిసి వాహనదారులపై చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తన్నుతూ చితకబాదారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చేవెళ్ల విలేకరులతో యువజన కాంగ్రెస్ చేవెళ్ల మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు.
వాహనదారులపై దాడి చేసి.. కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ
13