Visakha Crime : విశాఖలో ప్రేమోన్మాది కత్తి దూశాడు. యువతిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విధంగా అడ్డువచ్చిన యువతి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ న్యూ పోర్ట్ పరిధిలోని వుడా కాలనీ సమీపంలో ఉన్న ఓ యువతిని సిద్దూ అనే యువకుడు గతంలో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సిద్దూ యువతి కుటుంబంపై కక్షగట్టాడు. మంగళవారం యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ యువతి తల్లిపై అడ్డుకోవడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు కోసం గాలిస్తున్నారు.