Friday, March 20, 2026
Home » వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసింది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసింది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసింది - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • వివరాలు వెల్లడించిన శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి
  • నిందితుల మూడు సెల్‌ఫోన్‌లు ఒక కారు స్వాధీనం

ముద్ర/షాద్ నగర్:- వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని నిపంతో భార్య, ప్రియుడు కలిసి హత్యకు కుట్ర చేసిన సంఘటనను పోలీసులు చేధించారు. సోమవారం శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా డిసిపి నారాయణరెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎస్సై పరిధిలోని కడతాల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మక్త మాదారం గ్రామ శివారులోని బట్టర్ ఫ్లై సిటీ వెంచర్ లో ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో విశాల్ మార్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తాండ్ర రవీంద్ర (45) అన్న మృతుడిని భార్యతో పాటు తన ప్రియుడు యాదగిరి , అనిల్ కుమార్ కుమారులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి కొట్టి దారుణంగా చంపినట్లు డిసిపి వివరించారు.

మృతుని ఆనవాళ్లు ఎక్కడ కనిపించకుండా ఉండాలని ఉద్దేశంతో నిందితులు వెంచర్ల మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. ఈ ఘటనపై నేనావత్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి డీసీపీ. రవీందర్‌ను అరెస్టు చేసిన యాదగిరి, అనిల్ కుమార్‌తో పాటు భార్య గీతలను అరెస్టు చేయడంతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక కారును హత్య చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎస్సీపీ రంగస్వామితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. హత్య కేసును త్వరగా చేదించినందుకు పోలీస్ సిబ్బందిని డిసిపి నారాయణరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch