రాజమండ్రిలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మహానాడులో మాట్లాడుతూ ఈ సారి మహానాడుకు ఓ ప్రత్యేక కార్యక్రమం. రాజమహేంద్రవరం ఎన్టీఆర్ మెచ్చిన నగరమని అన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని బాబు అన్నారు. ఎన్టీఆర్ వందో ఏటా మహానాడు జరుపుకుంటున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ చిరునామా అని అన్నారు. సైకిల్ గుర్తు సామాన్యుడి శ్రమకు గుర్తింపు అన్నారు. సైకిల్‌కు ఎలక్ట్రిక్ హంగులు తీసుకొచ్చాం. ఇక దూసుకుపోతాం. నాలుగేళ్లు టీడీపీ కుటుంబ సభ్యులు త్యాగాలు చేశారు. నాలుగేళ్ళు కార్యకర్తల ఉక్కు సంకల్పంతో సైకిల్ ముందుకు వెళుతోంది. ప్రాణం తీస్తామని బెదిరించిన కార్యకర్తలు వెనకడుగు వేయలేదు. ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వందనం చేస్తున్నానని చెప్పారు చంద్రబాబు. జీవితంలో చూడని ఉత్సాహం, అభిమానం మీలో కనిపిస్తోందని అన్నారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకువెళతాం. త్వరలో ఎన్టీఆర్ శకం చేశారు. తెలుగుజాతి ప్రపంచంలో ప్రతిభావంతమైన జాతిగా చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.