Thursday, February 26, 2026
Home » ట్రాక్టర్ బోల్తా ఇద్దరు యువకుల దుర్మరణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ట్రాక్టర్ బోల్తా ఇద్దరు యువకుల దుర్మరణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ట్రాక్టర్ బోల్తా ఇద్దరు యువకుల దుర్మరణం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



కోరుట్ల, ముద్ర: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ శివారులో జరిగింది. మొరం తరలిస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి కెనాల్ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కింద పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఒకరు ముత్యంపేటకు చెందిన రాజేష్ కాగా మరోకరు హుస్సేన్ నగర్ కు చెందిన హైమద్ గా పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు . ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch