9
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు క్విడ్‌ప్రొ కోగా తయారయ్యాయని అన్నారు. కేంద్ర హోం మంత్రితో సీఎం జగన్ భేటీ అవగానే లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారని అన్నారు. శరత్ అప్రూవర్గా మారినందున కవితకు స్పాట్ పెడతారని, దాని ఫలితంగా అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందని అన్నారు. నా శత్రువును నువ్వు శిక్షించు…నీ శత్రువును నేను శిక్షిస్తా అన్నట్లుగా నేటి రాజకీయాలు తయారయ్యాయని అన్నారు.