35

- విజయవాడలో ఘోరం
- విద్యార్థులను బెదిరించిన ప్రిన్సిపాల్
ముద్రణ తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను వేదిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంబాపురంలో నవోదయ పారా మెడికల్ కళాశాల విద్యార్థులపై ప్రిన్సిపాల్ రవీంద్రరెడ్డి కోరికలు తీర్చాలంటూ బెదిరింపులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం ముగియడంతో టీసీలు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేధిస్తున్నట్లు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో వాట్సాప్‌లో అసభ్య మెస్సేజ్లు పెట్టేవాడని స్థలాలు. తన కోరికలను తీరిస్తేనే టీసీలు ఇస్తానని బెదిరించినట్లు విద్యార్థులను వాపోయారు. దీంతో చైల్డ్ లైన్ అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం విచారణ చేపట్టి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థులను కూడా విచారించారు.