
- మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్
ముద్ర.వీపనగండ్ల:- నాలుగు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నలబై ఏళ్లు నరకం చూపుతోందని వీపనగండ్ల మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్ అన్నారు.వీపనగండ్లలో గురువారం ఉపాధి హామీ పథకం కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కార్యకర్తలతో కలిసి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరెంటు. నీటి కష్టాలు మొదలయ్యాయని. అలాగే 2023లో శాసనసభ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది.
రైతులకు ఏనాడు పంటలు ఎండకుండా సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ దే అని అన్నారు. రైతుబంధు అందక, రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ మళ్లీ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పాలల్లో రైతులకు కన్నీళ్లు మిగిలాయని ఎద్దేవా చేశారు. నాలుగు నెలల్లో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అర్థమైందని. పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపై ఓట్లేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ముంత శివ యాదవ్, రాముడు, క్రాంతి నిర్వహించారు.