Friday, November 22, 2024
Home » టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏపీ హైకోర్టులో నోటీసులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏపీ హైకోర్టులో నోటీసులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల నియామకంపై పూర్తి వివరాలను అందజేయాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పాలకమండలిలో నేర చరిత్ర నేపథ్యం కలిగిన వారికి ఏపీ హైకోర్టు కల్పించారన్న పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయశాఖ కమిషనర్, టీటీడీ ఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించడంపై విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ పిల్ ను హైకోర్టు స్వీకరించింది. న్యాయమూర్తి ఆకుల శేషసాయి, జస్టిస్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం విచారించారు. దేవాదాయ చట్టాలకు వ్యతిరేకంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నియామకం చెల్లదంటూ పిటిషనర్ వ్యక్తులు. పిటిషనర్ న్యాయవాది జయ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న దేవదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోలను వివరణ కోరింది. పాలక మండలి సభ్యుల నియామకంపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch