Tuesday, February 24, 2026
Home » జగన్ పాలకుడు కాదు…కక్ష సాధించేవాడు: -నందమూరి బాలకృష్ణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

జగన్ పాలకుడు కాదు…కక్ష సాధించేవాడు: -నందమూరి బాలకృష్ణ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష సాధింపునకు ముఖ్యమంత్రి ఉండటంతో రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని 16 నిమిషాల్లో జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ఆయన ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమనే ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం ఉంది. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అన్నారు. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జిషీటు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింపచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2.13 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని అడిగారు. మళ్లీ తప్పుల మీద తప్పులు చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని అన్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ఇలాంటి న్యాయపోరాటం లేదని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch