4

ముద్రణ,రాయికల్ :రాయికల్ పట్టణంలోని బాలికల పాఠశాల వద్ద గల పోలింగ్ స్టేషన్లకు వెళ్లే దారిలో అనుమానితులను హల్చల్ చేశారు.దాదాపు 30 మంది యువతులు బ్యాగ్‌పై మాస్కులు ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పాత్రికేయులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వెనుతిరిగారు.
ఇట్టి విషయం పోలీసు శాఖ దృష్టికి తీసుకెళ్లగా వారిని విచారించి బస్సులో పంపించారు.కానీ ఇంత మంది యువత ఎందుకు వచ్చారు, దొంగ ఓట్లు వేసే దుకే వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పోలీస్ శాఖ వారిని అదుపులోకి తీసుకుని తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వెనుకకు పంపడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్లు పలు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.