Tuesday, February 24, 2026
Home » పీటీ వారెంట్ అమలు చేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం.? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

పీటీ వారెంట్ అమలు చేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం.? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడంలేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను జైలులోనే ఉంచి పూర్తి స్థాయి విచారణకు సిద్ధవల్సిందిగా కోర్టులను కోరేందుకు సిద్దమైంది ఏపీ సీఐడీ అందులో భాగంగానే అమరావతి రింగురోడ్డు స్కామ్ లో పీటీ వారెంట్ అమలు చేయవలసిందిగా పిటీషన్ దాఖలు చేయనుంది.

పీటీ వారెంట్ అంటే..?

ప్రిజన్ ట్రాన్సిట్ వారెంట్ దీనినే పీటీ వారెంట్ అంటారు.
నిందితుడు అంతకన్నా ఎక్కువ నేరాల్లో భాగస్వామి అయితే ఇలాంటి పిటీషన్ కోర్టులో వేస్తారు. ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నందుకు తాను చేసిన అన్ని తప్పులకు సంబంధించి అనేక మంది కోర్టులకు హాజరు పరచడానికి వేసే వారెంటునే పీటీ వారెంట్ అంటారు. దీనిని 40, 41 లా కమిషన్ అధారంగా చేసుకొని సెక్షన్ 267 సీఆర్ పీసీలో పొందుపరచడం జరిగింది.

పీటీ వారెంట్ చంద్రబాబుకు ఎలా అన్వయం అవుతుంది..?

చంద్రబాబును ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాములో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. అయితే ఈ కేసు నిమిత్తం సీఐడీ విచారణ కోరుతూ 5 రోజుల కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. దీనికి చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. అందులో భాగంగానే ఏపీ సీఐడీ మరింత దూకుడు పెంచింది అని చెప్పాలి. ఈ చంద్రబాబు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నవే కాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడిన వాట ప్రదర్శన వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ఈ వారెంట్ వేయబడుతుంది.

పీటీ వారెంట్ ఆదేశిస్తే బాబు పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం హై కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనికి దీటుగా ఏపీ సీఐ అమరావతి రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని గుర్తించి సీఐ పీటీ వారెంటును కోరనుంది. దీనిని ఏసీబీ కోర్టు ఆదేశిస్తే చంద్రబాబుపై మరిన్ని కేసులపై విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మరిన్ని కోర్టులకు తిరగాల్సి వస్తుంది. ఒక వేళ హై కోర్టులో బెయిల్ ఇచ్చే సమయంలో పీటీ వారెంట్ గనుక అమలు అయితే బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తాజాగా ఏపీ సీఐడీ అమరావతి రింగ్ రోడ్డు స్కాంలో పీటీ వారెంట్ కు ఆదేశించినట్లుగా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీని వల్ల ఒక కేసు నుంచి మరో కేసుకు లింకు చూపించేందుకు సీఐడీ ముందుకు వచ్చింది. దీంతో చంద్రబాబు పరిస్థితి ఏంటా అనే ఆసక్తి అందరిలో రోజురోజుకు పెరిగిపోతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch