Saturday, March 21, 2026
Home » YSRCP: పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

YSRCP: పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



  • ఎన్నికల వేళ వైసీపీని వీడుతున్న పలువురు నేతలు
  • టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
  • టీడీపీ, జనసేనలో చేరిన చెరొక ఎమ్మెల్సీ

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని స్పీకర్, శాసనమండలి చైర్మన్ వైసీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్‌లపై వేటు వేయాలని మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా… ఎమ్మెల్సీలలో రామచంద్రయ్య టీడీపీలో చేరారు.. వంశీ జనసేనలో చేరారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch