ముద్ర,తెలంగాణ:- హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి చేశారు. మధురానగర్ లోని రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు.

గాయపడిన కుక్కను, దాన్ని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీవ్రంగా స్థానికులు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో కూడా హస్కి కుక్క తోక ఊపుతూ తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. అయినా అక్కసుతో యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
దారుణం.. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి
మధురానగర్ – రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగకుండా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్ భార్యపై, పెంపుడు… pic.twitter.com/y3gJBfSlXj
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 16, 2024