Tuesday, February 24, 2026
Home » లో లెవెల్ బ్రిడ్జి… హై లెవెల్ కష్టాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

లో లెవెల్ బ్రిడ్జి… హై లెవెల్ కష్టాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 లో లెవెల్ బ్రిడ్జి... హై లెవెల్ కష్టాలు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ప్రమాదకరంగా గుంతలు.. తప్పని తిప్పలు
  • అధ్వానంగా మారిన జూలూరు- రుద్రేల్లి వంతెన

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు -రుద్రెల్లి గ్రామాల మధ్యగల లోలెవెల్ వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ వంతెనపై అడుగడుగున గుంతలకు తోడు ఇనుప చువ్వలు తేలడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ వంతెనపై ప్రయాణించాలంటే ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఈ వంతెనపై రవాణాే ప్రయాణికుల వాహనాల టైర్లు అనేకంగా ఉన్నాయి.

పోచంపల్లి నుండి బీబీనగర్ కు వెళ్లాలంటే ఈ దారి గుండ వెళ్లాల్సిందే. వర్షాకాల సమయంలో ఈ వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదే సమయంలో భువనగిరికి వెళ్లాలంటే వయ పెద్ద రావులపల్లి నుండి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వంతెన పై నుండి నీటి పారకం లేనందున ఈ సమయంలోనే నో లెవల్ వంతెన పై మరమ్మతు చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది .గతంలో జూలూరు నుండి రుద్రేల్లి వరకు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch