4

ముద్ర,తెలంగాణ:- జీవోలు, నోటిఫికేషన్‌లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని ముద్రణలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్షిప్తంగా టీజీని ఉపయోగించారు. తమ వాహనాలపై నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్‌గా మార్చింది.