Tuesday, February 24, 2026
Home » వైఎస్సార్సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వైఎస్సార్సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వైఎస్సార్సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



అమరావతి : వైఎస్సార్‌సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాగా రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థులను వైఎస్సార్సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇక, నేటి నుంచి 15వ తేదీ వరకు నామినేషన్లకు స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది. అనంతరం, అసెంబ్లీలో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ను గొల్ల బాబూరావు, మేడ రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి అభినందించారు. మేడ రఘనాథరెడ్డి నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లెకు చెందినవారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్‌ మేడ రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారులలో రెండవ కుమారుడు మేడా రఘునాధరెడ్డి. మొదటి కుమారుడు సిట్టింగ్ రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి. మేడ రఘనాథరెడ్డి అదే టంగుటూరులో విద్యాభ్యాసం పూర్తిచేశారు. డిగ్రి పూర్తైన వెంటనే 20 ఏళ్ల వయస్సులోనే బెంగుళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో ఎంఆర్‌కే ఆర్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలోనే కొనసాగుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch