Thursday, February 26, 2026
Home » నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 MLC Kavitha - కవిత కేసులో మలుపు... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ కవితను ఇవాళ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో రిమాండ్ నేటితో ముగియనుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటివరకు చాలాసార్లు తిరస్కరించబడింది.

ఈసారి కూడా కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తారా? లేక బెయిల్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఈరోజు కోర్టు పరిశీలించనుంది. ఆ తర్వాత కవితతోపాటు ఇతర నిందితులకు చార్జిషీట్ కాపీని అందించే అవకాశం ఉంది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కవితను నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch