
ముద్ర,తెలంగాణ:-ఇవాళ మధ్యాన్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈసీ నిబంధనలకు లోబడి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. అత్యవసర అంశాలు మాత్రమే కేబినెట్‌లో చర్చకు రానున్నాయి. ఉమ్మడి రాజధాని, రుణమాఫీలపై ఎలక్షన్ కమిషన్ చర్చ చేయొద్దని ప్రతిపాదన. జూన్ 4న చర్చించాల్సిన అంశాల్లో ఎజెండాగా కేబినెట్ సమావేశం జరగనుంది.
వడ్ల కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా చర్చించనున్నట్టు.పుస్తకాల పంపిణీ, స్కూల్ యూనిఫామ్‌ల డిష్టిబ్యూషన్, విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనలపై సమీక్ష జరగనుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే అంశంపై చర్చించనున్నారు. ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లపై ఇరిగేషన్ అధికారులతో రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు.