Wednesday, February 25, 2026
Home » కన్న కూతురిని చంపిన తల్లిదండ్రులు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కన్న కూతురిని చంపిన తల్లిదండ్రులు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 కన్న కూతురిని చంపిన తల్లిదండ్రులు.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- రాజన్న సిరిసిల్ల – తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య- ఎల్లవ్వ దంపతుల పెద్ద కూతురు ప్రియాంక(25) గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతూ చాలా మంది ఆసుపత్రులు, దేవాలయాల వద్దకు తీసుకెళ్లారు. కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో ప్రియాంకకు వివాహం జరిగి 13 నెలల కుమారుడు ఉన్నాడు.

మళ్ళీ నెల రోజులుగా ప్రియాంక మానసిక వ్యాధితో బాధపడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ, చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోవడంతో భర్త ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచి నయం కాకపోవడంతోపాటు విసిగిపోయిన తల్లిదండ్రులు 14వ రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హత్య చేశారు. ప్రియాంక అత్తగారికి చేతబడి చనిపోయిందని చెప్పి నమ్మించి అంత్యక్రియలు జరిగాయి.. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తల్లిదండ్రులే హత్యకు పాల్పడ్డారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch