Wednesday, February 25, 2026
Home » సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఎస్పీ డాన్స్ … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఎస్పీ డాన్స్ … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఎస్పీ డాన్స్ ... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- పోలీసులు లాఠీ పట్టుకుని డ్యూటీ చేయడమే కాదు.. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదరగొడతారన్న దానికి నిదర్శనం ఈ వీడియో. తాజాగా ఓ పోలీసు అధికారి.. మాస్ బీట్ కు తనదైన స్టెప్పులతో తోటి పోలీస్ అధికారులను ఉర్రూతలూగించారు. ఇంకేముంది ఆయనతోపాటు వారు కూడా కాలు కదిపారు. ఇంతకీ ఆ అధికారి ఎవరంటే.. కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్. ఓ ఫంక్షన్ హాల్ సమావేశమైన ఆయన తోటి అధికారులతో డ్యాన్స్ చేసి అలరించారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీస్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా పోలిస్ అధికారులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch