4

ముద్ర,తెలంగాణ:-దక్షిణ బంగాళాఖాతం ఈరోజు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 ఎత్తులో నేడు బలహీనపడిందని అన్నారు. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తెలంగాణ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 – 40 కి.మీ. ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.