Friday, March 13, 2026
Home » సాధారణ ధాన్యానికి కూడా బోనస్ చెల్లించాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

సాధారణ ధాన్యానికి కూడా బోనస్ చెల్లించాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 సాధారణ ధాన్యానికి కూడా బోనస్ చెల్లించాలి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులకు సన్న వడ్లతో పాటు సాధారణ వడ్లకు కూడా రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో దిలావర్ పూర్ లో మంగళవారం నిరసన తెలిపారు. శాఖ పిలుపు మేరకు జిల్లా సమన్వయ కర్త కొరిపల్లి రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసనలో భాగంగా ధాన్యం కళ్ల వద్ద నిరసన చేపట్టారు.కళ్లాల వద్ద రైతులు, ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధోగతి పాలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతన్నలకు ఇచ్చిన హామీలు అమలు, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటాం.

ఎన్నికల సమయంలో ఓ మాట, ముగిశాక మాట చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని మభ్యపెడుతున్నారని మరో మాట చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేక రైతులు నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మారుగొండ రాము, జడ్పీ కోఆప్షన్ సభ్యులు డా.యు. సుభాష్ రావు, చిన్నారెడ్డి, మహమ్మద్ నజీరొద్దిన్, సుధాన్, గంగారెడ్డి, సాయిరెడ్డి, కృష్ణ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, సురేష్, అన్వర్, లక్ష్మణ చారి, నెల అనిల్ గుర్తించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch