Monday, February 23, 2026
Home » స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ నేడు చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణల పేర్లను సీఐడీ తన చార్జిషీట్‌లో ప్రదర్శించారు. చంద్రబాబును నిందితుడిగా చూపూ ఇప్పటికే ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లోనూ సీఐడీ చార్జిషీట్ సమర్పించింది.

నాడు టీడీపీ ప్రభుత్వంలో అధికారం ఉన్న సమయంలో డెవలప్ మెంట్ పేరుతో కంపెనీల ద్వారా రూ.21 కోట్ల కుంభకోణంపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.దాదాపు రెండు నెలల పాటు రాజమండ్రి జైలులో గడిపిన చంద్రబాబు అక్టోబరు 31న విడుదలయ్యారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch