Tuesday, February 24, 2026
Home » Breaking: ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

Breaking: ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 Breaking: ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయం
  • సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం
  • పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం
  • సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో రాళ్లదాడి జరిగింది. మేమంతా సిద్ధం యాత్రలో పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డి బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు క్యాట్ బాల్ లో రాయిపెట్టి జగన్ పై దాడి చేశారు.

అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కనుబొమ్మకు

రాయి తగలడంతో గాయమై వాపు వచ్చింది. ఆయన పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస రావు కంటికి కూడా గాయమైంది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే బస్సుయాత్రను తిరిగి పొందడం. విద్యుత్‌కు అంతరాయం కలిగిన సమయంలో ఈ దాడి జరిగినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch