Saturday, March 14, 2026
Home » ఎంపీపీగా రవళి ఎన్నిక… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎంపీపీగా రవళి ఎన్నిక… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఎంపీపీగా రవళి ఎన్నిక... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర, మల్యాల: మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆగంతపు రవలి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. అంతకు ముందు బిఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్న మిట్టపల్లి విమల ఫై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె పదివిని కోల్పోగా ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మండల పరిషత్‌లో జరిగిన మొత్తం ఎంపీపీ ఎన్నిక 14 మంది ఎంపీటీసీలు ఉండగా, 7 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ ఎంపీటీసీ సభ్యులు.

రవళిని ఎంపీపీగా తాటిపల్లి ఎంపీటీసీ అనిత ప్రతిపాదించగా, రాంపూర్ ఎంపీటీసీ సభ్యురాలు పద్మ బలపరిచారు. ఒకే ఒక నామినేషన్ రావడంతో రావళి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఆర్దిఒ ప్రకటన. ఈ సందర్బంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎంపీపీ రవళిని అభినందించి, శాలువతో సత్కరించారు. అనంతరం ఎంపీపీ రవళి మాట్లాడుతూ… మండలంలో అన్ని విధాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch