Tuesday, February 24, 2026
Home » సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 లక్షల రివార్డు! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 లక్షల రివార్డు! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ.  2 లక్షల రివార్డు!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కొందరు ఆగంతకులు రాయితో దాడికి పాల్పడిన విష‌యం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కోరనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతిని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి వారికి స‌మాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇచ్చారు. అలాగే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము.

ఇదిలాఉంటే.. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? ఎయిర్ గన్‌తో ఏమైనా దాడి చేశారా? లేదంటే క్యాట్‌బాల్‌తో కొట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పాఠశాలకు, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక విచార‌ణలో తేలింది. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 40 మందిని విచారించారు. గంగానమ్మ గుడి దగ్గర సెల్‌ టవర్‌ పరిధిలో కాల్స్‌పై నిఘా కూడా పెట్టారు. దీనితో పాటు సీఎంపై జరిగిన దాడి కేసులో విచారణకు ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి సీపీ క్రాంతిరాణా ‘సిట్‌’ను ఏర్పాటు చేశారు. అజిత్‌సింగ్ నగర్‌లో 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch