Saturday, March 14, 2026
Home » వివాదస్పద భూములపై ​​విచారణ– అర్హులైన రైతులకు న్యాయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

వివాదస్పద భూములపై ​​విచారణ– అర్హులైన రైతులకు న్యాయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 వివాదస్పద భూములపై ​​విచారణ– అర్హులైన రైతులకు న్యాయం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర/వీపనగండ్ల:- మండల పరిధిలోని రంగవరం గ్రామ సమీపంలో వివాదస్పదంగా ఉన్న ప్రభుత్వ భూమిపై విచారణ జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టామని తాసిల్దార్ వరలక్ష్మి తెలిపారు. రంగవరం సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 357 లో 351 ఎకరాలను గోపాల్ దీన్నే, రంగవరం, పుల్గర్ చర్ల గ్రామాలకు చెందిన 173 మంది రైతులకు ప్రభుత్వం పట్టాలను అందించింది. అయితే కొందరు రైతులు పట్టాలో పొందిన భూమి కంటే ఎక్కువ భూమిని సాగు చేస్తే రైతుల మధ్య వివాదం ఉంది. ఈ విషయంపై రంగవరం గోపాల్దిన్నె గ్రామానికి చెందిన కొందరు రైతులు తమకు పట్టాలో చూపించిన విధంగా భూమికి హద్దులు చూపించాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట పలుమార్లు ఆందోళనలు నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ విషయంపై అధికారులు ప్రభుత్వ భూమి పైకి వెళ్లి విచారణ చేపట్టిన సమస్య కాకపోవటంతో రెండు నెలల క్రితం జిల్లా కలెక్టర్ తే నందాలాల్ పవర్, వనపర్తి ఆర్డీఓ పద్మావతి స్వయంగా ప్రభుత్వ భూమిని పరిశీలించి ఏ రైతు ఇంత భూమిని సాగు చేసుకుంటున్నారో తెలుసుకున్నారు. పట్టాలు పొందిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు రోజులుగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ వరలక్ష్మి, ప్రత్యేక భూసేకరణ అధికారి నాగరాజు పర్యవేక్షణలో వీపనగండ్ల డిప్యూటీ తాసిల్దార్ కృష్ణమూర్తి, పెబ్బేరు డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీకాంత్, వనపర్తి డిప్యూటీ తాసిల్దార్ విజయసింహ, కొత్తకోట డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్‌లతో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి భూపట్టాలను పొందిన రైతుల నుంచి వాగ్మూలం లక్ష్మిలు తీసుకుంటున్నారు. వరకు. సర్వే నెంబర్ 357 లోని ప్రభుత్వ భూమిలో పట్టాలు పొందిన కొందరు రైతులు పట్టాలో చూపించిన దాని కంటే మోకపై ఎక్కువగా సాగు చేస్తున్నారని, అలా కాకుండా పట్టాదారుకు ఎంత భూమి ఉందో గుర్తించి ఏలాంటి వివాదం లేకుండా, రైతులకు న్యాయం జరిగేలా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వీపనగండ్ల ఆర్ఐ కురుమూర్తి, ఘనపూర్ ఆర్ఐ గణేష్, చిన్నంబావి ఆర్ఐ రాములు, జూనియర్ అసిస్టెంట్లు మధు, రాజశేఖర్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch